నవతెలంగాణ రాయపోల్:
అన్ని దానాలలో కెల్లా విద్యాదానం గొప్పదని అక్షరాస్యత పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్ అన్నారు. శనివారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్, ఇతర పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉపాధ్యాయుల చేత విద్యా బోధన ఉంటుందని అలాంటి పాఠశాలలను బలోపేతం చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లయితే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరుగుతుందన్నారు. అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆర్థిక సహాయం, అన్నదానం లాంటి సేవా కార్యక్రమాలు చేసిన ఆరోజుకు మాత్రమే ఉపయోగపడతాయని చదువుకోడానికి సహకారం అందిస్తే ఆ విద్యార్థుల యొక్క జీవితం బాగు పడుతుందని వారి మీద ఆధారపడిన కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నవీన్ కుమార్,బ్రహ్మయ్య, నర్సింలు గౌడ్, దివాకర్, రాజిరెడ్డి, నర్సింలు, వసంత, శ్యాంసుందర్, కనకయ్య, సిఆర్పి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 09:10PM