- వీఆర్ఏ యూనియన్ మండల అధ్యక్షులు యాదగిరి.
నవతెలంగాణ రాయపోల్
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వీఆర్ఏల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లిన వీఆర్ఏలను ముందే పోలీసులు ముందస్తు అరెస్టు చేయడానికి ఖండిస్తున్నామని రాయపోల్ వీఆర్ఏల యూనియన్ అధ్యక్షులు యాదగిరి అన్నారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లిన వీఆర్ఏలను శనివారం ఉదయం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని షేక్ మహబూబ్ తెలిపారు. అనంతరం వీఆర్ఏల మండల అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీలను అమలు చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్ జీవో ను వెంటనే విడుదల చేయాలని ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం పట్ల సిసిఎల్ఎ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ చలో సిసిఎల్ఎ హైదరాబాద్ ఆఫీస్ శాంతియుత నిరసన తెలియజేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. వీఆర్ఏల అందరికీ పే స్కేల్ ఇవ్వాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని, 55 వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇతర సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం చలో హైదరాబాద్ శాంతియుత నిరసన కార్యక్రమానికి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లడానికి ముందే వీఆర్ఏ. ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీఆర్ఏలు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలలో వెట్టిచాకిరి చేస్తున్నారని అయినగాని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. అలాంటిది ముందస్తు అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. వీఆర్ఏల న్యాయమైన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల వీఆర్ఏలు పుట్ట నాగరాజు,స్వామి, రజిని కాంత్, నాగరాజు, బాలయ్య, బిక్షపతి, స్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 09:11PM