నవతెలంగాణ కంటేశ్వర్
నగరంలోని 16వ డివిజన్ లో గల కెనాల్ కట్ట వద్ద జరుగుతున్న నాలల పూడికతీత పనులను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ శనివారం పర్యవేక్షించారు.వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం తీసే పెద్ద నాలల పూడికతీత పనుల పురోగతిని పరిశీలించారు ఇప్పటికే వర్ష కాల వానలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.నాలల పూడికతీత పనుల పరిశీలనకు వెళ్తే అక్కడ ప్రతి నాలలలో వాడిపడేసిన వస్తువులు, చీరలు, బీర్ సిసలు కొబ్బరిబోండాలు నాలల నుండి బయటకు వస్తున్నాయని ప్రజలు చెత్తను నాలలలో వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm