నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సమర్పించిన జిల్లా కి చెందిన యంగ్ ఫిల్మ్ మేకర్ ఆనంద్ కొర్వ దర్శకత్వంలో రూపొందిన A GLORRY OF MEDARAM JATHARA డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ ను UK పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు శనివారం లండన్ నగరంలో జరిగిన Meet and Greet with KTR కార్యక్రమం లో ఆవిష్కరించారు. ప్రస్తుతం UK లో ఉంటున్న ఫిల్మ్ మేకర్ ఆనంద్ కోర్వ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సహకారంతో లండన్ నుండి వచ్చి ఈ సంవత్సరం ఫిబ్రవరి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర, విశిష్టత, సాంస్కృతిక వైభవాన్ని డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కి సంబంధించిన పోస్టర్ ను ఈరోజు ఆవిష్కరించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను, చరిత్ర విశిష్టతను డాక్యుమెంటరీ రూపంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందించ ఆనంద్ కొర్వ్ ను అభినందించారు. లండన్లొ ఉంటు మన మూలాలను మర్చిపోకుండా ప్రత్యేకంగా మేడారం జాతరకు వచ్చి రూపొందించటం అభినందనీయం అని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటాలని మరిన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్ ల ద్వారా తెలంగాణ కి చెందిన ఆనంద్ మంచి ఫిల్మ్ మేకర్ గా అంతర్జాతీయంగ గుర్తింపు పొందాలని అన్నారు. మన చరిత్ర వైభవాన్ని అనేక రూపాలుగా ప్రపంచ వ్యాప్తం చేయటానికి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. లండన్ లో కేటీఆర్ చేతుల మీదుగా మన చారిత్రక వైభవం అయిన మేడారం జాతర డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ జరగటం చాలా సంతోషంగా ఉంది అని, త్వరలో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను విడుదల చేయటంతో పాటు వివిధ international films festivals లో స్క్రీనింగ్ చేయనున్నట్లు ఫిల్మ్ మేకర్ ఆనంద్ కొర్వా అన్నారు. త్వరలోనే మేడారం జాతరకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ బాషా సంస్కృతిక శాఖ మరియు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సహకారంతో లండన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వ్యవస్థాపకులు అనిల్ కుర్ణచలం, అధ్యక్షులు రత్నాకర్ కడుడుల, సురేందర్ రెడ్డి, అశోక్ గౌడ్ దుసరి మరియు TAUK సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 09:20PM