నవతెలంగాణ-గోవిందరావుపేట.
ఏకకాలంలో రెండు లక్షల వ్యవసాయ రుణ మాఫీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని రంగాపురం గ్రామం లో క్లస్టర్ ఇన్ చార్జి నాగేంద్ర రావు ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ రచ్చబండ ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదని, కొత్త పంట రుణాలు ఇవ్వకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టివేశారని, ఇదివరకు కాంగ్రెస్ హయాంలో పహానిలకు రుణాలు ఇచ్చేవారని, ఇప్పుడు పట్టా పాస్ బుక్స్ ఉన్నవాళ్లకు ఇస్తూ పహాని ఉన్న రైతులను పంట రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. కనీసం వరదల వలన పంట నష్టపోతే కూడా పంట నష్టం ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నా రని అన్నారు. వరికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా, మిల్లర్లతో తెరాస ప్రభుత్వం కుమ్మక్కై రైతుల శ్రమను దోచుకుంటూ రైతాంగాన్ని దగా చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం రూ. 15000, కొత్త పంట రుణాలు, ధరణి రద్దు, రైతుకు భరోసా కల్పించి, ఉపాధి హామిలో వ్యవసాయాన్ని చేర్చి రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెట్టి సోమయ్య. దాసరి సుధాకర్. పాలడుగు వెంకటకృష్ణ, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సర్పంచ్ వాసం కన్నయ్య, రేగా కృష్ణారావు, బలుగూరి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 02:51PM