సర్పంచ్ ధరావత్ రాకేష్
నవతెలంగాణ-గోవిందరావుపేట
లక్నవరం నీటిని వృధాగా దుర్వినియోగం చేస్తున్న నీటిపారుదల శాఖ అధికారుల పై వెంటనే చర్యలు చేపట్టాలని పాపయ్య పల్లి సర్పంచ్ ధరావత్ రాకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పాపయ్య పల్లి గ్రామంలో శ్రీరామ్ పతి కాలువలో వృధాగా పోతున్న నీటిని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాకేష్ మాట్లాడుతూ రభీ సాగు ప్రారంభంలో ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు కాబట్టి సాగునీరు ఇవ్వబోమని నీటిపారుదల అధికారులు చెప్పారని.. నాటి నుండి నేటి వరకు కాలువ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉందని ఆయన అన్నారు. నీరు వృధాగా పోవడమే కాకుండా వందలాది ఎకరాల భూములు తడిసిపోయాయి అని ఆయన అన్నారు. ఈ ప్రకారంగా రైతులు భూములు తడిసి నష్టపోతున్నారని చెప్పారు. నేటి వరకు కూడా కాలువ చెరువు నీటితో ప్రవహిస్తూనే నీరు వృధా అవుతుందని ఆయన అన్నారు. నీటి విలువ తెలియని అధికారులు చెరువు పై అధికారులు గా పని చేయడం క్షేమకరం కాదని ఆయన అన్నారు. ఒకరకంగా చేపలు పట్టే వారి మామూళ్ల కు ఆశపడి నీటిని వృధాగా విడుదల చేస్తున్నారు అన్న సందేహం రైతులు నెలకొందని అన్నారు. పంటలు వేసుకుంటే ఈపాటికి ధాన్యం చేతికి వచ్చి రైతులకు కూలీలకు హమాలీలకు చేతినిండా పని ఉండేదని చెప్పారు. నీటిపారుదల శాఖ అధికారుల పుణ్యమా అని కూలీలు పనుల కోసం వలస పోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా లక్నవరం చెరువు నీటి పారుదల శాఖ అధికారులకు చెరువు పై గాని రైతులపై గాని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీటి వృధాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
వృధాగా పోతున్న లక్నవరం నీటిని అరికట్ట నట్లయితే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బానోతు కస్నా, నునావత్ జగన్, నునావత్ రవికుమార్, బానోతు రమేష్, నునావత్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 03:21PM