-తడి,పొడి చెత్త సేకరణపై అదనపు కలెక్టర్ ప్రశంసలు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తిమ్మాయిపల్లి, గాగీల్లాపూర్ గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణపై గ్రామస్తులకు ఎంపీడీఓ దమ్మని రాము ఆధ్వర్యంలో అదివారం అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ రాము మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా తడి, పొడి చెత్తను వేరుగా చేసి గ్రామ పంచాయతీ వాహనానికి అందజేయాలని తెలిపారు. అనంతరం వీధుల్లో చెత్త వేయడం,ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల ప్రకృతిల తలెత్తే సమస్యలపై గాగీల్లాపూర్ గ్రామ సర్పంచ్ అన్నాడీ సత్యనారాయణ రెడ్డి సారథ్యంలో నిర్మించిన లఘు చిత్రాన్ని ఎంపీడీఓ రాము ప్రశంసించారు. తడి,పొడి చెత్త సేకరణకు మండల అధికారులు తీసుకుంటున్న చర్యలకు జిల్లా అదనపు కలేక్టర్ ప్రశంసించారు. ఆయా గ్రామాల సర్పంచులు అన్నాడీ సత్యనారాయణ రెడ్డి, కవ్వ లింగా రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 03:22PM