చేర్యాల ప్రాంత న్యాయవాదులు
నవతెలంగాణ--చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు విషయంలో చేర్యాల ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చేర్యాల ప్రాంత న్యాయవాదులు అన్నారు. పట్టణ కేంద్రం లో ఆదివారం న్యాయవాదులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,మంత్రి హరీశ్ రావుల సహకారంతో పట్టణంలో మున్సిఫ్ కోర్టు త్వరలోనే ఏర్పాటు కానుందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ 2016లో ఏర్పాటు చేయబడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు జారిచేసిందని, ఉమ్మడి మెదక్ జిల్లాలో తూప్రాన్,అల్లాదుర్గం,పటాన్ చెరుతో పాటు చేర్యాల మున్సిఫ్ కోర్టులకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో న్యాయవాదులు భూమిగారి మనోహర్, అడిషనల్ ఏపిపిలు ముస్త్యాల స్టీవెన్,ఆరెళ్ళ వీర మల్లయ్య, ఆరెళ్ళ మహెందర్,మెరుగు రమేష్, పొన్నం సురేష్,గుస్క వెంకటేష్,అంకని సురేందర్, నీరటి వెంకటేష్, నల్లగొండ సంతోష్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 05:04PM