-ఉచిత వైద్య శిభిరం ప్రారంభోత్సవంలో సర్పంచ్ టేకు తిరుపతి
-ఇంపల్స్ ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన..
నవతెలంగాణ-బెజ్జంకి
ఆర్థిక ఇబ్బందులతో కార్పోరేట్ వైద్య చికిత్స పొందలేకపోతున్న నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు మంచి అవకాశాలుగా మారాయని ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ టేకు తిరుపతి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద కరీంనగర్ పట్టణంలోని ఇంపల్స్ న్యూరో కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ టేకు తిరుపతి ప్రారంభించారు.ఆస్పత్రి వైద్యలు డాక్టర్లు ప్రశాంత్,రాకేశ్ గ్రామస్తులకు రక్తపోటు, మధుమేహం,తిమ్మిర్లు,పక్షవాతం, తలనొప్పి,గుండే జబ్బు,మూర్ఛ వ్యాధి వంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లబించిందని ఉచిత వైద్య పరీక్షలు,మందులు పంపిణీ చేసిన ఆస్పత్రి యాజమాన్యం,సిబ్బందికి సర్పంచ్ తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో ఎంపీఓ విష్ణు వర్థన్,ఉపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 05:06PM