-ఏఐఏవైఎస్ అద్వర్యంలో ఘనంగా భాగ్య రెడ్డి జయంతి వేడుకల
నవతెలంగాణ-బెజ్జంకి
బాలికల విద్య కోసం పాఠశాలను నెలకొల్పి వ్యసనాలు లేని సమాజమే ద్యేయంగా అలుపెరుగని పోరాటాలు చేసి దళిత దీపీకగా భాగ్య రెడ్డి వర్మ ఖ్యాతి గడించాడని ఏఐఏవైఎస్ మండలాద్యక్షుడు దీటీ బాలనర్సు కొనియాడారు. అదివారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద ఏఐఏవైఎస్ అద్వర్యంలో భాగ్య రెడ్డి వర్మ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా అయన చిత్రపటానికి నాయకులు పూలమాలు వేసి నివాళులర్పించారు. జిల్లాధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్,జిల్లా ప్రధానకార్యదర్శి ఎల శేఖర్ బాబు,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింతకింది పర్షరాములు,యాదవ సంఘం మండలాధ్యక్షుడు మేకల శ్రీకాంత్ యాదవ్,గౌడ సంఘం నాయకులు చెప్యాల సంతోష్ గౌడ్, కత్తి అంజయ్య గౌడ్, పొట్లపెల్లి శంకర్, పొట్లపెల్లి శివ క్రిష్ణ,బెంబిరి రాజు,కనగండ్ల శంకర్,కర్రావుల శరత్,కనగండ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 08:01PM