జక్రాన్పల్లి బ్రిడ్జి వద్ద లభించిన లారీ
భిక్నూర్ పోలీసులను అభినందించిన ఎస్పి
నవతెలంగాణ-భిక్కనూర్
రెండు కోట్ల విలువైన అల్యూమినియం లారీలో చెన్నై నుండి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భిక్కనూర్ సమీపంలో అపహరణకు గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గంటల సమయంలోనే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం భిక్కనూర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను తెలిపారు.
చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్నా 2 కోట్ల విలువైన అల్యూమినియం సామాగ్రి లారీ జీపీఎస్ ట్రాకర్ ను లారీ డ్రైవర్ సహెద్, క్లీనర్ సహెల్ ఖాన్ జాకీర్ లు భిక్కనూర్ హర్యానా దాబా వద్ద శనివారం తొలగించారు. దీన్ని గమనించిన లారీ ఓనర్ చెన్నై నుంచి 100కి ఫోన్ చేశారు. సమాచారం అందిన భిక్కనూర్ పోలీసుల పోలీసులు లారీ డ్రైవర్ కు ఫోన్ చేశారు. అతను ఫోన్ తీయకపోవడంతో శనివారం రాత్రి 10:30 గంటలకు లారీ కోసం గాలించగా అర్థరాత్రి 12:30 గంటల సమయంలో జక్రాన్ పల్లి సమీపంలోని బ్రిడ్జి ప్రక్కన లారీ లభించింది. 2 కోట్ల విలువైన అల్యూమినియం సామాగ్రిని దొంగలించిన కారణంగా లారీ డ్రైవర్ క్లీనర్ పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగిలించిన రెండు గంటల సమయంలోనే కేసును ఛేదించిన భిక్కనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, సబ్ ఇన్స్పెక్టర్ హైమద్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 08:08PM