నవతెలంగాణ రాయపోల్:
సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాయపోల్ మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యా శాఖ అధికారి నరసమ్మ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ రాయపోల్ మండల పరిధిలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అవి రాయపోల్, బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అని తెలిపారు. రాయపోల్ మండలంలోని అనాజీపూర్, రాయపోల్, రాంసాగర్, రాయపోల్ కేజీబీవీ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో పాటు దౌల్తాబాద్ మండలంలోని తిర్మలాపూర్ , ముబారస్‌పూర్, సెంట్ ఆన్ తోన్స్ పాఠశాలల విద్యార్థులు మొత్తం 221 మంది రాయపోల్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయనున్నారన్నారు. అలాగే రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి, బేగంపేట, రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు, గజ్వేల్ మండలం మక్త మాసాన్ పల్లి, దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మొత్తం 210 మంది విద్యార్థులు బేగంపేట కేంద్రంలో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయం ఉదయం 9: 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు ఉంటుందన్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. పదో తరగతి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 08:45PM