నవతెలంగాణ - అశ్వారావుపేట
విద్యార్ధులకు అవసరమైన అన్ని హంగులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మండల పరిషత్ అద్యక్షులు శ్రీరామమూర్తి తెలిపారు. మన ఊరు మన బడి పధకంలో ఎంపిక అయిన అశ్వారావుపేట ప్రాథమిక పాఠశాల పునరుద్ధరణ పనులను ఆయన జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి తో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుండి అన్ని హంగులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు చెపాపరు. అశ్వారావుపేట ప్రాథమిక పాఠశాలలో 18 లక్షల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నాము అని అన్నారు. జెడ్పిటిసి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ బడిలోనే విలువలతో కూడిన విద్య లభ్యం అవుతుంది అని .. సుశిక్షితులైన ఉపాధ్యాయుల చే బోధన జరుగుతుంది అని.. పోషకాహారం తో కూడిన మధ్యాహ్న భోజనం ,ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఉపసర్పంచ్ కేదార్నాథ్, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షురాలు హసీనా, ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ శ్రీలక్ష్మి,ఎస్ఎంసి సభ్యులు ఉపాధ్యాయులు నీలావతి, సురేష్, సి ఆర్ పి ప్రభాకర చార్యులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 May,2022 08:51PM