నవతెలంగాణ-మంథని
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు సోమవారం మంథని తాసిల్దార్ బండి ప్రకాష్ ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు. మంథని ఎక్సైజ్ సీఐ గురువయ్య తెలిపిన వివరాల ప్రకారం మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేటకు చెందిన పీక సమ్మక్క అనే మహిళ ఫిబ్రవరి 8న నాటు సారా అమ్ముతుండగా,ఎక్సైజ్ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసి మంథని తాసిల్దార్ ముందు హాజరు పరచి బైండోవర్ చేశారు. మళ్లీ ఆ మహిళ ఏప్రిల్ 18న నాటుసారా విక్రయిస్తూ పట్టుబడింది. దాంతో మళ్లీ ఆమె పై కేసు నమోదు చేసి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మంథని తాసిల్దార్ ముందు హాజరుపరిచారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు మంథని తాసిల్దార్ బండి ప్రకాష్ లక్ష రూపాయలను జరిమానా విధించగా సోమవారం లక్ష రూపాయల మొత్తాన్ని ఆమె చెల్లించింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ గురువయ్యమాట్లాడుతూ నాటు సారాయిని,ముడి పదార్థాలను,బెల్లంను,అమ్మిన ఎడల చట్టరీత్యా కేసు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మంథని ఎక్సైజ్ ఎస్సై సాయిరాం,సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 07:50PM