నవతెలంగాణ డిచ్ పల్లి.
ఈనెల 26 నుండి 30 వరకు చండీఘర్ లో జరగనున్న జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు
నిజామాబాద్ జిల్లా బాలికలు ఎంపికయ్యారని నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. గంగా మోహన్ లు తెలిపారు. సాఫ్ట్ బాల్ జుట్టు సోమవారం బయల్దేరి వెళ్లిందని వివరించారు. నిజామాబాద్ జిల్లలోని పలు పాఠశాలల నుండి ఎంపికైన క్రిడకారులు..
ఏ ఇందు (సాంఘిక సంక్షేమ కళాశాల పోచంపాడ్),
కె సృజన, మహేశ్వరి, జి సౌందర్య, ( సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి),
డి సరయు (సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం)
కే సోనీ ( ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఇందల్వాయి) ,
డి.అరుణ (సాంఘిక సంక్షేమ పాఠశాల తడ్కోల్), ఎం.శ్రీ హర్షిత (శ్రీ సాయి జూనియర్ కాలేజ్ నందిపేట్)
బాలురు..
ఎల్ శివ కుమార్, బి.నిలేందర్, ఎం సెంథిల్( సాంఘిక సంక్షేమ కళాశాల ఆర్మూర్) ని
ఈ సందర్భంగా ధర్మారంబి లో జరిగిన అభినంద కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాంఘిక సంక్షేమ పాఠశాల డి సి ఓ సంగీత మాట్లాడుతూ చండీఘర్ లో జరిగే జాతీయ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో రాష్ట్ర జట్టు ను ప్రథమస్థానంలో తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ పాఠశాల స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నీరజ , జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సోప్పరి వినోద్, వ్యాయామ ఉపాధ్యాయులు జోష్ణ, నల్లూరి లత, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ అనికేత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 07:58PM