ఇకనుండి ఎకరానికి 50 మొక్కలే....
65 లక్షలు మొక్కలు పెంపకం.....
ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి
నవతెలంగాణ - అశ్వారావుపేట
విస్తరిస్తున్న పామ్ ఆయిల్ సాగు నేపద్యంలో ఖమ్మం జిల్లా,వేంసూరు మండలం,కల్లూరిగూడెం లో త్వరలో పామ్ ప్యాక్టరీ నిర్మించనున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి ప్రకటించారు. సాధారణ సందర్శనలో భాగంగా ఆయన సోమవారం ఆయిల్ ఫెడ్ నర్సరీ, ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం సంస్థ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయిల్ ఫెడ్ కేటాయించిన విస్తీర్ణానికి సరిపడా 65 లక్షలు పామ్ ఆయిల్ మొక్కలు పెంచుతున్నామని అన్నారు. మార్చి 31,2022 నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2700 మంది రైతులు 12 వేల ఎకరాలకు,ఖమ్మం జిల్లాలో 8 వేల ఎకరాలకు 2297 మంది రైతులు మొక్కలు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.ఏ జిల్లాలో పెంచిన మొక్కలు ఆ జిల్లా వారికే పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా పంపిణీ చేస్తామని తెలిపారు. గతంలో ఎకరానికి 57 మొక్కలు ఇచ్చేవారని ఇకనుండి 50 మొక్కలే ఇస్తామని వివరించారు.పామ్ ఆయిల్ దీర్ఘకాలిక అంతర్ పంటలు సాగు నేపథ్యంలో ఉద్యాన శాస్త్రుజ్ఞుల సూచన మేరకు ఈ నిర్ణయం చేసామని అన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో జాబితా ప్రకారం 15 రోజులు ముందే దరఖాస్తుదారు లకు సమాచారం ఇస్తామని తెలిపారు.సన్న చిన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ డి.ఒ ఉదయ్ కుమార్,ఫ్యాక్టరీ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణ,డిప్యూటీ మేనేజర్ నాగబాబు,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,రైతులు ఆలపాటి రాం చంద్ర ప్రసాద్,చీమకుర్తి వెంకటేశ్వరరావు,కొటారి చలపతి రావులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 08:02PM