నవతెలంగాణ- తాడ్వాయి
మతిస్థిమితం లేకుండా రోడ్డుమీద అనాధగా తిరిగే వారికి, మతిస్థిమితం లేనివారికి మొత్తం 30 మందికి సోమవారం సాహో దయ హెల్పింగ్ హాండ్స్ సభ్యుడు జాయ్ పుట్టినరోజు సందర్భంగా పౌష్టిక ఆహారాన్ని అందించి సహాయపడ్డారు. ఈ రోజున వారికి తలంటు స్నానాలు చేయించి నూతన వస్త్రాలు వేయించి మంచి రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాధగా మతిస్థిమితం లేకుండా తిరిగే ఎంతోమందికి సేవచేస్తున్నామని పేర్కొన్నారు. వైద్య సేవలు కూడా అందించి వారి ఇండ్లకు పంపుతున్నామని తెలిపారు. ఇంకా అనేక సహాయ సహకారాలు పేద ప్రజలకు అనేక కార్యక్రమములు చేయాలి అని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బోడ రాజు, జాయ్, జయరాజు, ఇమ్మానుయేలు, ఉదయ్, చందు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 08:32PM