రెడ్ల సింహగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలి.
రెడ్డి జేఏసీ రాష్ట్ర నాయకులు గోపు జైపాల్ రెడ్డి.
నవతెలంగాణ-గోవిందరావుపేట.
ఈ నెల 29న హైదరాబాద్ లో నిర్వహించే రెడ్ల సింహగర్జన బహిరంగ సభను రెడ్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర నాయకులు గోపు జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో మండల రెడ్డి సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ యానాల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ల సింహగర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపు జైపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. అనంతరం పద్మ మాట్లాడుతూ 500 కోట్లతో ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు. 20 లక్షల రూపాయల విదేశీ విద్యార్థి నిధి పథకాన్ని అర్హులైన పేద రెడ్డి విద్యార్థులకు వర్తింప చేయాలన్నారు. జాతీయస్థాయిలో ఈ డబ్ల్యు ఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన రైతాంగానికి నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని వర్గాల మాదిరిగా రెడ్డి పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సౌకర్యం కల్పించాలని.. ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులకు గురుకులాలు స్టడీ సర్కిల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా అనేక న్యాయపరమైన డిమాండ్లతో ఈనెల 29న హైదరాబాద్ ఘట్కేసర్ లు నిర్వహిస్తున్న రెడ్ల సింహగర్జన బహిరంగ సభను రెడ్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు పల్లె జైపాల్ రెడ్డి. ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి. పింగిలి జైపాల్ రెడ్డి. పశం మాధవరెడ్డి. బొబ్బా మధుసూదన్ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 08:35PM