నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ఓ.... కలెక్టర్ సారు... మా కష్టాన్ని మీరు గుర్తించి సొసైటీ వారు తొందరగా మా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చుడండి మహాప్రభో.... అని కలెక్టర్ కార్యాలయం వచ్చి రైతులు వేడుకున్నారు. వరి ధాన్యాన్ని పండించడానికి రైతులు ఆరుగాలం కష్టపడి విత్తనాలు వేసి... మొలకెత్తి... నాటేసి.... కలుపు... కలిసి, కోత కోసి వడ్లు ఎండ పెట్టిన తరువాతనే తేమ శాతం తోనే రైతులు పండించిన పంటకు ధర పలుకుతుంది. ఇది ఒక సమస్య అయితే దానికి తోడు రైస్ మిల్లర్లు కడ్తాల పేరుతో కదం తొక్కుతున్నారు అని సుమారు 400 మంది ఆర్మూర్ మండలం మాచర్ల రైతులు ఆవేదనతో ఇబ్బంది పడుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. పండించిన వరి పంట కు క్వింటాలుకు 11 నుండి 12 కీలోలు కడ్తా తీయడంతో రైతులు ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కడ్తా దోపిడీని అరికట్టాలనీ రైతులు డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకున్న ధర రాక, సరిగా తూకం వెయ్యక, హమాలీ ఖర్చులు అన్నిటినీ రైతు పైనే మోపుతున్నరని వాపోయారు. ఆలూరు సొసైటీకి తూకం వేసిన తర్వాత వారంరోజుల వరకు కాంట చేసిన స్థలం లోనే ఉండడంతో అక్కడ కూడా బరువు తగ్గిపోతుందని అన్నారు. ఇప్పటికే మాచర్ల గ్రామ రైతుల పంటను 60 వేల క్వింటాలు సరుకు తీసుకున్న, నేటికీ 30000 క్వింటాళ్ల వరిధాన్యం అలాగే ఉండిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దయచేసి ప్రభుత్వం స్పందించి కడ్తా దోపిడీని అరికట్టాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో జగదిశ్వేర్, భూమన్న, నర్సయ్య రైతులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 09:00PM