తహశీల్దార్ చల్లా ప్రసాద్ పరిశీలన...
నవతెలంగాణ - నవతెలంగాణ
మండలంలో పదవి తరగతి పరీక్షలు కోసం ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులకు కావాలస్సిన మౌళిక సౌకర్యాలను అధికారులు,నిర్వాహకులు కల్పించారు.అశ్వారావుపేట పట్టణంలోని బాలురు ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 219 మంది,బాలికల ఉన్నత పాఠశాలలో 130 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 124 మంది మాత్రమే హాజరయ్యారు. మండలంలోని సున్నంబట్టి పాఠశాలలో 113 మంది విద్యార్థులకు గాను మొత్తం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు పరీక్షా పర్యవేక్షకులు ఎం.ఈ.ఓ పెండెకట్ల కృష్ణయ్య స్పష్టం చేశారు. అశ్వారావుపేట రెండు సెంటర్లను తహసీల్దార్ చల్ల ప్రసాద్ పర్యవేక్షించి విద్యార్థులకు అందించిన సౌకర్యాలను పరిశీలించారు. అదేవిధంగా సున్నంబట్టి పాఠశాల సెంటర్ ను కొత్తగూడెం జిల్లా స్క్వాడ్ ఆకస్మీక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించాల్సిన త్రాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్డి సౌకర్యాలతో పాటు ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించటంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు .మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్యం పనులు నిర్వహించారు. పరీక్షల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహణ సి.ఎస్ లు కాంతయ్య,టి.శ్రీనివాస్,కె.నరసింహారావు, సిఆర్పి సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 09:03PM