నవతెలంగాణ - అశ్వారావుపేట
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని సి.ఐ బాలక్రిష్ణ తెలిపారు. ఇటీవల సంస్థాగతంగా జరిగిన బదిలీల్లో బాగంగా అశ్వారావుపేట వచ్చిన ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అసాంఘీక కార్యక్రమాల నివారణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను వదిలేది లేదని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హమీ ఇచ్చారు. గంజాయి,నిషేధిత గుట్కా రవాణ,విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులను సమన్వయం చేసుకుంటూ ఫ్రెండ్లీ పోలీస్ ను పటిష్టపరిస్తానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 May,2022 09:04PM