నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని న్యాలకల్ రోడ్డులోని ఈ.యస్.ఐ ఆసుపత్రిని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ ఆకస్మికంగా సందర్శించారు.
ఆసుపత్రికి వచ్చే కార్మికులకు, ఇతర సంస్థలో విధులు నిర్వహించే ఈ.యస్.ఐ పరిధిలోకి వచ్చే వారికి అందిస్తున్న సేవలను ఆధికారులను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగుల నమోదు రిజిస్టర్ తనిఖీ చేసి వారికి అందిస్తున్న సేవల గురించి ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి రోజు నగరంలో పారిశ్యుద్ద పనులు నిర్వహించే కార్మికులకు అందుబాటులో ఉండే ఈ.యస్.ఐ ఆసుపత్రిలో ఎటువంటి సేవలు అందిస్తున్నారో తెలుసుకోవాలని ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు.
21వేల కంటే వేతనాలు తక్కువగా ఉన్న ప్రతి నమోదు చేసుకున్న సంస్థలో విధులు నిర్వహించే ప్రతి వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు ఈ ఆసుపత్రిలో సేవలను వియోగించుకోవాలని తెలిపారు. మహిళ కార్మికులకు అందించే ప్రసూతి సెలవులను వాడుకోవాలని, కుటుంబ సభ్యులకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఆసుపత్రి సందర్శన సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినోద,డాక్టర్ స్వప్న ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 05:52PM