నవ తెలంగాణ, కోడేరు: మండల పరిధిలోని ఈర్ల కుంట తండా లో గల అంగన్వాడి కేంద్రాన్ని మంగళవారం సూపర్వైజర్ శోభారాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారానే పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఐదు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీలకు పంపాలని సూచించారు. అలాగే అంగన్వాడి టీచర్ వరలక్ష్మి నీ పోషకాహారం మరియు పిల్లల హాజరు శాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా పిల్లలకు పోషకాహారం అందిస్తున్న అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి నీ ఆమె ప్రశంసించారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బరువు తక్కువ ఉన్న పిల్లలు అంగన్వాడి ద్వారా సరఫరా అయ్యే పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలని ఆమె అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm