నవతెలంగాణ- తాడ్వాయి
మండల కేంద్రంలో ని ఇంద్రనగర్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్ తో కలిసి మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎవరు కూడా మొబైల్ ఫోన్ లను తీసుకొని రాకుండా చూడాలని, కోవిడ్ నిబందనలను తప్పకుండా పాటించాలన్నారు. పశ్నా పత్రాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, వేసవి దృష్ట్యా విద్యార్థులకు చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బందులకు గురికాకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఓఎంఆర్ షీట్, పశ్నా పత్రాలను పరిశీలించారు. విద్యార్థులు పరీక్షా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట విఆర్వో తాడెం వీరస్వామి, వీఆర్ఏ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. కాగా మండలంలోని నార్లాపూర్ లోని పరీక్ష కేంద్రాన్ని ఎం ఈ ఓ యాప సాంబయ్య, అటాచ్డ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ లు సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 06:16PM