నవతెలంగాణ-గోవిందరావుపేట.
మండలంలోని లక్నవరం చెరువు లో చేపల వేట ప్రారంభమయింది. మంగళవారం ఒంగోలు నుండి వచ్చిన జాలర్లు తమ పదవులను వల ను ఉపయోగించి చేపల వేటను చేశారు. ఈ సందర్భంగా సంబంధిత గుత్తేదారు రమేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చేపలు ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. అంతేకాక రభీ సాగు లేకపోవడం వల్ల మీరు అధికంగా ఉండటం వల్ల చేపలు పట్టడం కష్టంగా ఉందని తెలిపారు. చెరువులో ఇంకా 20 అడుగుల నీరు ఉందని కొంత నీరు తగ్గితే చేపలవేట సులభమవుతుందని అన్నారు. ఒంగోలు నుండి 30 మందిని చేపల వేటకు జాలర్లను తీసుకువచ్చినట్లు సుమారు నెల రోజుల పాటు చేపల వేట కొనసాగుతుందని తెలిపారు. చెరువులోకి చేపలు పట్టే వారు రావడంతో సమీప గ్రామాల ప్రజలు చేపలు కొనుక్కునేందుకు చెరువు వైపు కదులుతున్నారు.బయట మార్కెట్లో కిలో చేప 150 రూపాయలు కాగా చెరువు వద్ద 100 నుండి 120 రూపాయలకి ఇస్తున్నారని ప్రచారం ఊపందుకున్నధి.
ఫొటో. లక్నవరం చెరువు లో చేపలు పడుతున్న జాలర్లు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 06:19PM