ప్రయివేటుపాఠశాల విద్యార్థులకు సహకరిస్తున్న ఇన్విజిలేటర్లు
పరీక్షలు అయిపోయిన తర్వాత చెట్ల కింద పార్టీలు
ర్యాంకుల కోసం అడ్డదారులు తొక్కుతున్న ప్రయివేటు పాఠశాలలు
నవతెలంగాణ-భిక్కనూర్
'మా పాఠశాలలో 20 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తే 10 మందికి విద్యార్థులు 10/10 మార్కులు వచ్చాయి` అంటూ చెప్పుకుంటూ దీనిని ఆసరాగా చేసుకుని ఫీజులు, విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. విద్యార్థులు కష్టపడి చదువు కొని మార్కులు సాధించుకోవాల్సి ఉండగా కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు మాత్రం విద్యార్థులు పాస్ అవ్వడానికి, 10/10 మార్కులు సాధించడానికి తెరవెనుక కొంత మంది ఇన్విజిలేటర్లతో ములాకత్ అయి తమ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకుంటున్నారని తెలుస్తోంది. తెర ముందు పరీక్షా కేంద్రాలలో అందరూ సమానమే ఉన్నట్టు చూపుతున్నా, తెరవెనుక మాత్రం కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు తమ విద్యార్థులే అత్యధిక మార్కులు సాధించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని పరీక్ష కేంద్రాలలో ఉన్న కొందరు ఇన్విజిలకేవలంతో ముందుగానే తెరవెనుక ఒప్పందం చేసుకుని విద్యార్థులు చూచిరాతలు పర్వానికి అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో రాత్రి పగలు కష్టపడి చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరీక్ష కేంద్రాల్లో కొన్ని ప్రయివేటు విద్యా సంస్థల తో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్విజిలేటర్లు ఆ విద్యాసంస్థల విద్యార్థులకు సహకరిస్తూన్నరని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒక్కో పరీక్ష కేంద్రంలో పరీక్షలు చీఫ్ సూపరిండెంట్ ఆఫీసర్ ఆధీనంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రంలో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరిగిన పూర్తి బాధ్యత చీఫ్ సూపరిండెంట్ అధికారిదె. కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు ఆయా పరీక్ష కేంద్రాలలో తమ విద్యార్థులకు కొంచెం సహకరించాలని సూపరిండెంట్ అధికారి సైతం ములాకత్ అయినట్లు సమాచారం. ఇది కేవలం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు, జిల్లాలోని కొన్ని మండలాల్లో కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు ఇన్విజిలేటర్ల తో కుమ్మక్కై నట్లు సమాచారం. ఇప్పటికైనా కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారుల పై ఎంతైనా ఉందని.. కష్టపడి చదువుకుంటున్న విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 06:39PM