నవతెలంగాణ నిజామాబాద్ సిటి
ఎన్ఆర్ఈజీఎస్ 2005 ఉపాధి హామీ చట్టం అమలు చేసి జాతీయ మొబైల్ మానిటరింగ్ విధానాన్ని రద్దు చేయాలని, నిత్యవసర ధరలు పెరిగినందున కనీస వేతన చట్టం ప్రకారం రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా రాష్ట్ర నాయకులు ప్రభాకర్ కోరారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా, అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకెఎంఎస్ ) ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి బారి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాలు ప్రవేశించడంతో గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని సాగు భూములు దేశ వ్యాప్త ఉద్యమం రావడంతో ఉద్యమ ఫలితంగా తాత్కాలిక ఉపాధి ని చూపిస్తూ ఉపాధి హామీ చట్టం 2005 లో రూపొందించబడిందని అన్నారు. ఉపాధి హామీ చట్టం పేర్కొన్నట్టుగా కనీస సౌకర్యాలు అమలు కావడం లేదని.. సర్వే జరపగా వాస్తవాలు బయటకు వచ్చాయి అని ఆయన అన్నారు. కానీ ఉపాధి కూలీల పేరుతో అధికారులు కోట్ల రూపాయలు దండు కుంటున్నారని కూలీలకు శ్రమను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఉదాహరణకు డిచ్ పల్లి మండలంలో సోషల్ ఆడిట్ చేసిన సందర్భంగా మూడు కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని దానికి ఏపీవో లను సస్పెండ్ చేశారన్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడి పేద కూలీలను దోచుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. రోజురోజుకు ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా పనిచేసే ఉపాధి కూలీల సంఖ్య తగ్గుతుందని దీనికి కారణం ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన అన్నారు. గత సంవత్సర బకాయిలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా కనీసం రూ. 257 వచ్చిన ఎక్కడ వచ్చిన సందర్భం లేవని అన్నారు. కూలి రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదని కనీస వేతన చట్టం లో చెప్పినట్టుగా రోజుకు 600 రూపాయలు కూలి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టంలో చెప్పినట్టుగా మంచినీళ్ల సౌకర్యం లేదు, ఆటో చార్జీలు లేవు ఎండాకాలం 30శాతం ఒకసారి రావాల్సిన వేతనాలు నెలలతరబడి రావడం లేదు అన్నారు.
ధర్నా సందర్భంగా ప్రజా పంధా జిల్లా ఇన్చార్జి కార్యదర్శి వి.కృష్ణ మాట్లాడుతూ.. కూలీలను అవమానపరిచే విధంగా జిఓ 333 సర్క్యులర్ తీసుకొచ్చి జాతీయ మొబైల్ మార్కెటింగ్ విధానాన్ని అమలు చేయడం శోచనీయమని అన్నారు. రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసి పని స్థలం నుండి పంపడం ఏంటని ప్రశ్నించారు. కూలీలు పని చేసే స్థలం ఎక్కువగా కొండలు గుట్టలు ఊరికి దూరంగా చెరువులు ఆ ప్రాంతాల్లో అయితే మొబైల్ సిగ్నల్స్ నెట్వర్క్ పనిచేసిన సహకరించక పోవడం వల్ల కూలీల హాజరు విధానాన్ని ఎలా నిరూపించుకోవాలి అని ఆయన ప్రశ్నించారు. ఒకపక్కన వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు బడా పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తూ వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధి కూలిన చట్టాన్ని అమలు చేసుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలకులను కోర్టు ముందు నిలబెట్టి ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు బి.దేవారం, జిల్లా అధ్యక్షులు, కే గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా ఆఫీస్ బేరర్స్ సిహెచ్.సాయి గౌడ్, సురేష్ పుట్టి నడిపి నాగన్న, పి.రాజేశ్వర్, సిపిఐ (ఎం ఎల్ ప్రజా పంధా) నాయకులు బి.మల్లేష్ ,డి.రాజేశ్వర్, ఆర్ రమేష్, ఎం.సుధాకర్, ఎం.సుమన్, జి.కిషన్, ఎం.సత్తెక్క, బి.బాబన్న, ఏం.సాయి రెడ్డి, బి.కిషోర్, ఎం.లింబాద్రి, కట్ట రాములు, అనీష్, మురళి, సాయిలు, నజీర్ , తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 06:43PM