-- డి సి సి ఆర్గనైజింగ్ కార్యదర్శి వెన్న మధుకర్ రెడ్డి.
నవతెలంగాణ చివ్వేంల
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలకు పరిహారం అందించకుండా ఇతర రాష్ట్రాల్లో రైతులను అదుకుంటాము అంటూ వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఏ మాత్రమైనా బుద్ధి ఉందా అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్.కార్యదర్శి వెన్న మధుకర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల ,రైతుల , అమరవీరుల కుటుంబాలను ఏనాడు పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇతర రాష్ట్రాలలోని రైతులను అదుకోవడంలో ఉన్న మతలబు ఏమిటి అని ప్రశ్నించారు. కన్న తల్లికి మట్టి గాజులు చేపించలేని వాడు పినతల్లికి బంగారు గాజులు చేపిస్తాను అన్నట్టు ఉంది మన కె సి ఆర్ పరిస్థితి అని అన్నారు. ముఖ్యమంత్రి కి ఏమాత్రం తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉన్నా వెంటనే రైతుల రుణమాఫీ చేసి వానాకాలం పంటలకు బ్యాంకుల ద్వారా రుణాలు పెట్టిబడి సహాయం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.. ఎవరి అబ్బా సొమ్ము అని ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ సమావేశం పెట్టిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని టూరిస్ట్ లతో పోల్చిన మీ కొడుకు , మీరు ఇతర రాష్ట్రాలు ,దేశాల వెంట ప్రజల సొమ్మతో తిరుగున్న మిమ్ములను ఏమనాలి అని ప్రశ్నించారు. తెలంగాణలోని నియంత , నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర లొనే ఉన్నాయని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 07:21PM