తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను, క్రీడ స్థలాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్
నవతెలంగాణ- తాడ్వాయి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్ సంబంధిత అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ సత్య ఆంజనేయ ప్రసాద్ లతో కలసి మండలంలోని కాటాపూర్, దామర్వాయి గ్రామాల్లో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కాటాపూర్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణానాన్ని సందర్శించి పరిశీలించారు. ధాన్యం రాశులు ఉన్నప్పటికి కోనుగోలు ప్రారంభించక పోవడం తో వెంటవెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. తాసిల్దార్ కొనుగోలు కేంద్రాల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద జాప్యం జరగకుండా జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని,హమాలీ లు పెంచి లిఫ్టింగ్, లారీ లు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యం.. మిల్లులకు రవాణా చేయాలని అన్నారు. అనంతరం ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్, కాటాపూర్ పంచాయతీ కార్యదర్శి కోరం భాగ్య రాణి లతో కలసి కాటాపూర్ హైస్కూల్ ప్రాంగణంలో తెలంగాణ గ్రామీణ క్రీడా మైదాన స్థలాన్ని పరిశీలించారు. రేపటి నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో సర్పంచ్ గౌరమ్మ, ఆర్ ఐ సాంబయ్య, విఆర్ఓ తాడెం వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి కోరం భాగ్య రాణి, వీఆర్ఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 07:22PM