నవతెలంగాణ డిచ్ పల్లి.
ఏడాది లో యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశానని ఇంక రాబోవు రోజుల్లో ఇంకా అభివృద్ధి కి పాటుపడతనని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి రవిందర్ గుప్తా అన్నారు. గతేడాది 22-05-2021 న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులై ఒక సంవత్సర పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు గాను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్ గుప్తా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ సమావేశ హాల్లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో తాను నిర్వహించిన పనులను వివరించారు.
కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా కుంటుబడి పోయిన అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలను పునరుద్ధరణ చేయడానికి పూనుకున్నానని,వివిధ విభాగాల వారీగా, వివిధ కార్యాలయాల వారీగా భారీగా మౌలిక వసతులను కల్పించామని తెలిపారు. ఫర్నిచర్, కంప్యూటర్స్, జిరాక్స్ మిషన్స్ వంటివి అందించానని, సైన్స్ విభాగాలకు పరిశోధనకు అవసరమైన కెమికల్స్, ఎల్ సి డి ప్రొజెక్టర్స్, పరిశోధనా పరికరాలు అందించాడం జరిగిందని అన్నారు. వర్క్ లోడ్ అవసరాన్ని బట్టి వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్స్ నియామకం చేశారు.నిరంతరం విభాగాలను పర్యవేక్షణ చేసి, అధ్యాపకులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుకున్నామన్నారు. దీనితో విద్యాపరమైన క్రమశిక్షణ (అకడమిక్ డిసిప్లైన్) పెరిగిందని, తరగతులు పరీక్షలు నిర్వహించామన్నారు.
అన్ని యూనివర్సిటీల కంటే ముందుగానే మన యూనివర్సిటీలో డిగ్రీ (యూజీ) పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశామని, విభాగాల వారీగా నూతనంగా వస్తున్న ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా సిలబస్ రూపకల్పనలకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. విభాగాల వారీగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ కమిటీని పునరుద్ధరణ చేశారు. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతుల ను ఎంపిక చేసుకోవడానికి సూచనలు చేశామని,
రీసెర్చ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని, కరోనా నేపథ్యంలో వెనుకబడిపోయిన పరిశోధనల్లో వేగం పెంచామని తెలిపారు. అన్ని విభాగాల్లో పిహెచ్. డి. పరిశోధనలు విస్తృత స్థాయిలో జరిగాయని, దానికి అవార్డులు పొందారన్నరు. చాలా పిహెచ్. డి. వైవా వోస్ లకు స్వయంగా హాజరై వారి వారి పరిశోధనా విధానాన్ని తెలుసుకున్నానని,గ్రామీణ విషయ ప్రాధాన్యం గల విభిన్న పరిశోధనలు వెలువడ్డాయని పేర్కొన్నారు. ప్రధాన ప్రాంగణం, సౌత్ క్యాంపస్ లలో గల హాస్టల్స్ కి ఫర్నీచర్ అందించారు. అవసరమైన డైనింగ్ టేబుల్స్, చైర్స్, కాట్స్, వంట సామాగ్రి వంటివి కొత్తగా తయారు చేయించారు. బాలుర వసతి గృహానికి పెయింటింగ్ వేయించామని తెలిపారు.క
హెల్త్ సెంటర్ ప్రారంభించి డాక్టర్ నియామకం చేశామని, ఫార్మసీ మందులు, పరికరాలు, కాట్స్, ఒ పి, జనరల్ వార్డ్ వంటివి అందుబాటులో ఉంచామన్నారు. చాలా కాలంగా మూసీ వేయబడిన క్యాంటీన్ ను తెరిపించామని... కొన్ని అత్యవసర నిత్యావసర వస్తువులతో పాటుగా అక్కడ ఇంటర్ నెట్, జీరాక్స్ అందుబాటులో తెచ్చామని, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా పోటీ పరీక్షల విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అనుబంధంతో విద్యార్థులకు శిక్షణా ఇప్పిస్తున్నామని, అందుకోసం లైబ్రరీలో కాంపిటీటివ్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, జర్నల్స్, సబ్జెక్ట్ బుక్స్ అందుబాటులో ఉంచామన్నారు.
పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల కోసం మైదానంలో ట్రాక్, ట్రేసింగ్ వంటివి ఏర్పాటు చేసి,స్పోర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించి బెంగుళూరు, చెన్నై వంటి ప్రదేశాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొనే విధంగా ప్రోత్సాహాన్ని అందజేశమని,. దాదాపు వందకు పైగా ఉన్న ప్రోగ్రాం యూనిట్లు గల జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) లో అనేక స్పెషల్ క్యాంప్ లు నిర్వహించదానికి అనుమతి ఇచ్చామన్నారు. యూజీసీ 6.52 కోట్ల నిధులను మంజూరు చేయడానికి సంసిద్ధం అయ్యిందని, సామాజిక మంత్రిత్వ శాఖ నుంచి 5 కోట్లు బాలికల హాస్టల్ నిర్మాణం,
డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ డ టెక్నాలజీ నుంచి 3 కోట్లు,SC Hub నుంచి 5 కోట్లు, ST Hub నుంచి 10 కోట్లు వివిధ పరిశోధక కోసం, ప్రాజెక్టుల కోసం నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించాడం జరిగిందని అన్నారు. TSCOST & DST వంటి సంస్థలలో ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు పంపితే అక్కడి నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయని, 20 కోట్ల నిధులతో సైన్స్ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామని పనులు. శర వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఆగస్టులో సైన్స్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నేడు చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ సదస్సు నిర్వహిం చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యంగా నానో - టెక్నాలజీపై అధ్యయనం, నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. దేశ విదేశాల్లోని ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబుల్ హారెంట్స్ పాల్గొంటారని తెలిపారు. అమెరికాలోని రోవన్ యూనివర్సిటీలో పిహెచ్. డి. పరిశోధన చేయడం కోసం వీసీ మిత్రులు ప్రొఫెసర్ డా. కందాలం రామానుజాచారి బిక్నూర్ లో గల ఫిజిక్స్ విభాగంలోని విద్యార్థులకు నెలకు 2500 యు ఎస్ డాలర్స్ ఫెలో షిప్ గా అందించడానికి సంకల్పించుకున్నట్లుగా తెలిపారు. జాతీయ పరిశోధనా సంస్థలలో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విద్యార్థులు ఇంటర్న్ షిప్ చేయడానికి వెళ్లారని, సమ్మర్ రీసెర్చ్ ఫెలో షిప్ ను కూడా పొందారని పేర్కొన్నారు. IQAC కార్యాలయం నుంచి న్యాక్ సెకండ్ సైకిల్ ప్రపోజల్స్ పంపించారు. ఎస్ ఎస్ ఆర్ / ఎ క్యూ ఎ ఆర్ రిపోర్ట్స్ పంపించామని, ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వంటి తదితర జాతీయ స్థాయి సంస్థలతో ఎం ఒ యు కుదుర్చుకున్నామన్నరు. టీయూను రాగింగ్ ఫ్రీ యూనివర్శిటీ గా తీర్చిదిద్దా మని,కరోనా నేపథ్యంతో కోవిడ్ నిబంధనల మూలంగా విద్యా సంవత్సరం వెనుక బడి పోయిన సందర్భం లో సెమిస్టర్ కోల్పోకుండా వేసవి కాలంలో కూడా సెలవులు ఇవ్వకుండా కళాశాలలను నడిపిస్తున్నామన్నరు. కాలేజీలో హాజరు కోసం, లైబ్రరీలో పోటీ పరీక్షల శిక్షణ కోసం వేసవి కాలంలో కూడా సెలవులు ఇవ్వకుండా హాస్టల్స్ నడిపిస్తున్నామని వివరించారు. అకడమిక్ కన్సల్టెంట్స్ ను కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా మార్చామని, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు 11, 241 జి.ఒ. ప్రకారం వేతన పెంపుదల చేశామని చెప్పారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 60, 63 జి.ఒ. ప్రకారం వేతన పెంపుదల చేశామన్నారు. నిరంతర ఆకస్మిక తనిఖీల ద్వారా అనుబంధ కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కఠిన చర్యలు తీసుకుంటు అనేకం పాత బకాయిల వసూలు జరిగాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే పనులను పై వివరించారు.
నానో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, కాన్వకేషన్ నిర్వహణ, ఆడిటోరియం నిర్మాణం, ఇండోర్ స్టేడియం, అవుడోర్ స్టేడియం ఏర్పాటు,బాలికల హాస్టల్ నిర్మాణం, పరీక్ష విభాగం భవనం,అడిట్ సెల్ భవనం,సోషల్ సైన్స్ బిల్డింగ్ నిర్మాణం, రీసెర్చ్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ మంజూరు నిధులతో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో సైన్స్ టెక్నాలజీ విభాగాల ఏర్పాటు,హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ఫేం పార్లమెంట్ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. శివశంకర్, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. ఆరతి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డా. కె. లావణ్య, సారంగపూర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డా. మహేందర్ రెడ్డి, డా. వి. త్రివేణి, డా. రాంబాబు, డా. సంపత్ కుమార్, డా. ఆంజనేయులు తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 08:05PM