నవతెలంగాణ-ధర్మసాగర్
గ్రామంలో మంచి నీటి సమస్యలతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మిషన్ భగీరథ సంబంధిత అధికారులను ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మిషన్ భగీరథ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు పూర్తి స్థాయిలో గ్రామంలో అందడం లేదని, ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని సర్పంచ్ అన్నారు. ఈ నీటి సమస్యను పరిష్కరించడం కోసం అదనంగా గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారు.తరచూ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీల సమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ జవహర్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్ ఈ ఈ రామాంజనేయులు,డీ ఈ జీవన్ ప్రకాష్,ఏ ఈ సుధా, ఇంట్రా ఈ ఈ మల్లేశం,డీ ఈ సునీత, పంచాయతీ కార్యదర్శి మహేష్, కారోబార్, పంపు ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 08:40PM