నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని బిక్ నూర్ సౌత్ క్యాంపస్ లో గల ఫిజిక్స్ విభాగానికి ఇన్ చార్జి అధ్యక్షులుగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్. కె. లావణ్య నియమితులైనారు. నియామక పత్రాన్ని మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి. రవీందర్ అందజేశారు.వైస్ ఛాన్సలర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ డా. కె. శివశంకర్ సంబంధిత నియామక ఉత్తర్వును జారీ చేశారు. డాక్టర్. కె. లావణ్య తెలుగు అధ్యయనశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగు అధ్యయనశాఖకు అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm