నవతెలంగాణ రాయపోల్
స్నేహమంటే కలిసి చదువుకోవడం కలిసి తిరగడం పార్టీలు వినోదాలు విందులు మాత్రమే కాదని ఒకసారి వ్యక్తులతో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారితే ఎల్లప్పుడు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనం అని నిరూపిస్తూ నిజమైన స్నేహానికి మారుపేరుగా వడ్డేపల్లి స్నేహితులు నిలిచారు. రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో మహమ్మద్ షాదుల్లా గుండెపోటుతో అకాల మరణం చెందారు. షాదుల్లా క్లాస్ మెట్స్ 1996 బ్యాచ్ కి చెందిన స్నేహితులు మంగళవారం వడ్డేపల్లి గ్రామంలో షాదుల్లా కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ షాదుల్లా గుండెపోటుతో అకాలమరణం చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్నేహితులంటేనే సంతోషంలో పక్కనుండి ఆపదవస్తే ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం కాదన్నారు. ఆపదలో ఆదుకునే వారు నిజమైన స్నేహితులని పేర్కొన్నారు. తమ స్నేహితుడు షాదుల్లా లేని లోటు వారి కుటుంబ సభ్యులకు తీర్చలేనిదని, స్నేహితులుగా తమ వంతు ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా మానవతావాదులు ముందుకు వచ్చి షాదుల్లా కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజాగౌడ్, మల్లేశ్,చెన్నయ్య, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 08:47PM