నవతెలంగాణ - అశ్వారావుపేట
సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ స్వలాభ పేక్ష విపరీతంగా పెరిగిపోయిందని ఎప్పుడైతే వ్యక్తి స్వేచ్ఛకు దూరం పలికి సామూహిక హితం పలుకుతారో అప్పుడే సామాజిక శ్రేయస్సుకు పునాదులు ఏర్పడతాయని ఆ క్రమంలోనే రాముడు మెచ్చిన రాజ్యం సాధ్యమవుతుందని శ్రీశ్రీశ్రీ భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీతీర్ధం స్వామి వారు వ్యాఖ్యానించారు.ప్రతి ఒక్కరిలోనూ సమాజ హితం ఇనుముడింప జేసుకోవాలని అన్నారు. సోమవారం పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద వేంచేసియున్న పురాత శ్రీ
దాసాంజనేయ స్వామివారి సన్నిధిలో త్రి సహస్రగళ సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మూడువేల మంది భక్తులచే ఏకపఠనంతో హనుమాన్ చాలీసా పారాయణం పటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా విచ్చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు ముందుగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. దాసాంజనేయస్వామివారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆలయ అర్చకులు రామకృష్ణ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం సామూహిక పారాయణం కార్యక్రమంలో పాల్గొని భక్తులతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ భక్తిని పెంచుకోవాలని నిత్యం శాంతి మూర్తులుగా మెలగాలని సూచించారు.సామూహిక పారాయణ పఠనం అనంతరం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు రవికుమార్,ఎం.పి.పి శ్రీరామమూర్తి,జెడ్పిటిసి సభ్యురాలు వరలక్ష్మి, స్థానిక పి.ఎ.సి.ఎస్ ఆపద్ధర్మ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు,రైతు బంధు మండల సమన్వయ కర్త,తెరాస జిల్లా నాయకులు జూపల్లి రమేష్,మండల అధ్యక్షులు బండి పుల్లారావు,సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 08:49PM