నవతెలంగాణ డిచ్ పల్లి.
డిచ్ పల్లి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద సోమవారం రాత్రి నాగర్ సోల్ నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందినట్టు నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన దవత్తు యాదగిరి (66)కి గత ఆరు నెలల క్రితం పక్షపాతం రావడంతో కుటుంబ సభ్యులు ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. దాంతో కొద్దిగా ఆరోగ్యం కుదుట పెడుతుండగా.. ఎంత చేసిన ఆరోగ్యం సరికాదని మనస్తాపం చెందాడు యాదగిరి. సోమవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా డిచ్ పల్లి మండల కేంద్రం లోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఎడవ బెటాలియన్ వద్ద ఉన్న శ్రీ మహాలక్ష్మీ ఆలయం వద్ద రైలు పట్టాలపై పడుకుని నర్సాపూర్ వేళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి.. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 09:24PM