నవతెలంగాణ కంటేశ్వర్
జూన్ 4,5 తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగనున్న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బి ఎల్ టి యు రాష్ట్ర ప్రధమ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నిజామాబాదు జిల్లా కేంద్రం లో శివాజీ నగర్ లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర కార్యాలయం లో విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్దిరాములు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'జూన్,4,5,తేదీల్లో కామారెడ్డి జిల్లా కేంద్రం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ, రాష్ట్ర ప్రథమ మహా సభలను ఎర్పాటు చేయడం జరిగింది. జూన్ 4,న కామారెడ్డి గంజ్ నుండి ఉదయం 11,గంటలకు ర్యాలి ప్రారంభం అవుతుంది, ఈ ర్యాలి, కామారెడ్డి సి ఎస్ ఐ గ్రౌండ్ వారకు కొనసాగుతుంది, అనంతరం సి ఎస్ ఐ గ్రౌండ్ లో మధ్యాహ్నం 2,గంటల కు బహిరంగ సభ ఉంటుంది, జూన్,5,న కామారెడ్డి ఫంక్షన్ హాల్ ,ప్రతినిధుల మహా సభకు 13,జిల్లాల నుండి,500,మంది ప్రతి నిధులు హాజరు అవుతారు. జూన్ 4,శనివారంనాడు సి ఎస్ ఐ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ ,కు యస్, సిద్దిరాములు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, అధ్యక్ష తన జరిగే ఈ సభకు ముఖ్య అతిథి గా,కా,మద్దికాయల అశోక్,యం సిపిఐ(యు) జాతీయ కార్యదర్శి, హాజరు అవుతారు, ముఖ్య వక్త లుగా నల్లా సూర్య ప్రకాశ్, బిఎల్ ఎఫ్ చైర్మెన్, ప్రో. కాశిం,ఉస్మానియా యూనివర్సిటీ, ప్రో,ప్రభంజన్ యదవ్,తెలంగాణ యూనివర్సిటీ, మరియు వక్త లుగా, పటేల్ వనజ రాష్ట్ర కన్వీనర్,బహుజన మహిళల సంఘం, దండి వెంకట్, బిఎల్ టీయూ, రాష్ట్ర అధ్యక్షులు, కే,పర్వతాలు, బహు జన కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షులు,క్యాతం,సిద్దిరాములు, అడ్వకేట్ బహుజన ఐక్య వేదిక, కామారెడ్డి జిల్లా, జగన్నాథం,అడ్వకేట్, టీ,జె,సి,కామారెడ్డి జిల్లా కన్వీనర్,ఎం అంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, కమ్మరి సదానందం,కామారెడ్డి జిల్లా కార్యదర్శి, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, ఎం,డి,ఖాలిల్,టి,ఎఫ్ టీయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కె,చెంద్ర శేఖర్,ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భవన నిర్మాణ చ్తెతన్య కార్మిక సంఘం,సాప శివరాములు,బిసి సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కొత్త పల్లి మల్లన్న, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు, తదితరులు హాజరై మాట్లాడుతారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికులు,ప్యాకర్లు, బట్టి చటన్, టేకేదార్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, నిజామాబాదు జిల్లా కోకన్వీనర్, యస్డి స్తెయ్యద్, జిల్లా నాయకులు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 04:04PM