- దళితులకు ఉచిత విద్యుత్ ను 101 యూనిట్ల నుంచి 300 యూనిట్లకు పెంచాలి
- కెవిపిఎస్ డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
జీవో నెంబర్ 342ను సవరించాలాని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సూపర్డెంట్ ఎస్ఈ కి కెవిపిఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఇప్పటి వరకు ఉన్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్ స్లాబ్ ను 101 నుంచి 300 యూనిట్లకు పెంచాలని కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ ఎస్ఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వము ఇచ్చినటువంటి గత ఐదు సంవత్సరాల కాలంలో లో పున్నయ్య కమిషన్ ద్వారా నిర్వహించినటువంటి 342 జీవో ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ పేద కుటుంబలకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని అని జీవో ను విడుదల చేసిందని తెలిపారు. గృహావసరాల కొరకై ప్రభుత్వాలు మాత్రం జీఓను పట్టించుకోకుండా అధిక ధరలతో యూనిట్ చార్జీలు 100 యూనిట్ల వరకు ఒక ఛార్జ్, 100 దాటితే ఇంకొక చార్జిగా ప్రజల నుంచి వసూలు చేయడం దారుణం అన్నారు. పేదలకు ఒకే రేటు నిర్ణయించడం సరైందని మరి అదే విధంగా గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఎటువంటి రాయితీలు లేకుండా కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవోను ఈ విద్యుత్ సంస్థ పక్కన పెట్టకుండా జీవో 342ను సవరించి ఒక 101 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతున్నది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నల్ వాల్ నర్సయ్, మల్లగల లక్ష్మణ్, ప్రభాకర్, పాల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 05:16PM