-ఏఈఓ రేణుకా శ్రీ సూచన
-వానకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన..
నవతెలంగాణ-బెజ్జంకి
అధిక దిగుబడులనిచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలని ఏఈఓ రేణుకా శ్రీ సూచించారు.బుధవారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వానకాలం సాగు చేసే పంటలపై రైతులకు ఏఈఓ రేణుకా శ్రీ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ పచ్చి రోట్టే ఎరువులను వినియోగిస్తూ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు ఆశించిన దిగుబడులను సాదించవచ్చునన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకుని ఆయిల్ ఫామ్,మల్భరీ పంటల సాగుకు ఆసక్తి చూపాలని రైతులకు సూచించారు.సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు,గ్రామ రైతులు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm