3వ రోజు 187 గైర్హాజరు
నవతెలంగాణ కంటేశ్వర్
పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మూడోరోజు బుధవారం 22,397 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 22210 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 187 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలియజేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి జిరాక్స్ షాపులు తెరచి ఉంచకూడదు అనే నిబంధనల మేరకు అన్ని జిరాక్స్ షాప్ బంద్ చేయించారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో 153 సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి దుర్గాప్రసాద్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. జిల్లా లెవెల్ అబ్జర్వర్లు 5 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ 46 బృందాలు పరిశీలించినట్లు తెలియజేశారు. ఎక్కడైతే అవసరమున్నా ఇన్విజిలేటర్లు అందుబాటులో లేని వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలియజేశారు. అలాగే 153 సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలను అన్ని సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 05:51PM