నవతెలంగాణ డిచ్ పల్లి.
తెలంగాణ యూనివర్సిటీలోని ఎన్ ఎస్ ఎస్ (జాతీయ సేవా పథకం) వాలంటీర్స్ ముంబయ్ లో జరుగుతున్న జాతీయ సమగ్రతా శిబిరం (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్) లో బుధవారం సాంస్కృతిక కార్యక్రమాల పోటీలలో పాల్గొన్నారని ఎన్ ఎస్ ఎస్ కో - ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ 'అమ్మేరు` నృత్యాన్ని ప్రదర్శించారన్నారు. బుధశారం వారు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఈ నృత్యం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నెలకొని ఉన్న మూఢ విశ్వాసాలను నిర్మూలించడం పట్ల అవగాహన కల్పించారన్నారు. ఇందులో భాగంగా బోనాలు, బతుకమ్మ పండుగల వైభవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీదుగా విచ్చేసిన వివిధ ప్రాంతాల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ ను, ప్రోగ్రాం ఆఫీసర్స్ ను ఈ నృత్యప్రదర్శన అబ్బుర పరిచిందన్నారు. ఎన్ ఎస్ ఎస్ రీజినల్ డైరెక్టర్ డ యూత్ ఆఫీసర్ అజయ్ సింధే ప్రత్యేకంగా ప్రశంసించారన్నారు. ఈ కార్యక్రమంలో టీయూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు షేక్ అజర్, జె. సంజయ్, పి. వివేక్, సిహెచ్. ఓంకార్, మాలావత్ పవన్, రామగిరి గంగోత్రి, ఇలితం బబిత, పుప్పాల వర్ష, పల్లికొండ మౌనిక, ఎం. ప్రవల్లికబీ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 05:55PM