నవతెలంగాణ డిచ్ పల్లి.
నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ ను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి. రవీందర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, శాలువా, జ్ఞాపికతో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిని పై వీసీ సెక్రటరీకి తెలిపారు. గ్రామీణ ప్రదేశంలో గల తెలంగాణ యూనివర్సిటీకి అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా సహాయ సహకారాలు అందించాలని ఆమెను కోరారు.యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి సహకారమైన ప్రభుత్వ తరఫున అందిస్తామని ఆమె హామీ ఇచ్చానట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్ గుప్తా తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm