తాసిల్దార్ రాజ్ కుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో అనుమతులు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఏడు వాటర్ ప్లాంట్లను బుధవారం సీజ్ చేసినట్లు తహసిల్దార్ అంలం రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అనుమతులు అసలు లేవని గతంలో పలుమార్లు ప్రజా ఫిర్యాదుల అందిన నేపథ్యంలో తనిఖీ నిర్వహించి సీజ్ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ కార్యాలయం మరియు అధికారుల ద్వారా పలుమార్లు వాటర్ ప్లాంట్ యాజమాన్యానికి నోటీసులు పంపించినా యాజమాన్యం స్పందించకపోవడంతో బుధవారం విస్తృతంగా వాటర్ ప్లాంట్లపై తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని వాటిని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరు తయారు చేస్తున్న నీటిలో వాడుతున్న కెమికల్ మోతాదుకు మించి వాడుతున్నారని దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మరికొన్ని వాటర్ ప్లాంట్ ల నిర్వాహకులు చిలుము తో కూడిన ఐరన్ పైపులను ఫంగస్ తో కూడిన ప్లాస్టిక్ క్యాన్లను వినియోగిస్తూ ప్రజారోగ్యాన్ని ఖూని చేస్తున్నారన్నారు. వీరివల్ల ముందు ముందు ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్త కూడదని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కూలింగ్ వాటర్ పేరుతో కూడా మోసం చేస్తున్నారని ప్రజా ఫిర్యాదులు అందాయని...
వాటర్ కూలింగ్ లో కూడా పరిమితులు దాటి అతి కూలింగ్ తో కూడిన నీటిని ప్రజలకు అందించడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. తాసిల్దార్ రాజ్ కుమార్ వెంట రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్. వీఆర్ఏ పున్నం చందర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 06:37PM