నవతెలంగాణ-మంథని
మంథని మున్సిపాలిటీలో అధికారులు వింత ధోరణి అందిస్తున్నారని తెలుస్తుంది.మున్సిపల్ అనుమతి లేకుండా రహదారిని ఆక్రమించి అక్రమ షెడ్ నిర్మాణం చేపట్టిన అధికారులు చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యమేమిటని పలువురు ఆరోపిస్తున్నారు అక్రమంగా నిర్మించిన షెడ్డు చుట్టూ తీగెల ఏర్పాటు చేయడంతో అధికారులు సభ్యులు ప్రేక్షక పాత్ర పోషిస్తు సంపన్నుల సేవలో తరిస్తున్నరని పట్టణ ప్రజల విమర్శలున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే...సామాన్యులను రాజకీయ ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టి సత్వరమే కక్ష సాధింపు చర్యలు చేపట్టే గతంలో ఘన కీర్తి కలిగిన అప్పటి మేజర్ గ్రామ పంచాయతీ...ఇప్పుడు మున్సిపల్ గా రూపాంతరం చెందిన పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదనీ తెలుస్తోంది.మంథని మున్సిపల్ పరిధిలో సామాన్య ప్రజలు ఏదైనా నిర్మాణం చేస్తే అనుమతి లేదని,సెట్ బ్యాక్ లేదని,ఓ రాజకీయ నాయకుడు వెంచర్లు ఏర్పాటు చేస్తే అనుమతి లేదని ఆఘమేఘాల మీద చర్యలు తీసుకుని హద్దు రాళ్లు కూలగొట్టే మంథని మున్సిపల్ అధికారులకు పట్టణం నడి బొడ్డున గాంధీ చౌక్ లో రావికంటి రామయ్య విగ్రహం సమీపంలో ఓ వ్యాపారి ఏకంగా మున్సిపల్ అనుమతి లేకుండా ప్రజలు నడిచే రహదారిని
ఆక్రమించి రోడ్డుపైనే ఓ రేకుల షెడ్ వేసి దాని చుట్టూ ఆక్రమించి తీగెలతో గోడలు పెట్టి నిర్మాణం పూర్తి చేసిన మున్సిపల్ అధికారులకు కనిపించక పోవడంపై పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఆ స్థలంలో ఉన్న భవనం ముందు ఉన్న రహదారి స్థలం తమదేనని స్థానిక కౌన్సిలర్ అండతో ఏకంగా రహదారిని ఆక్రమించి,మున్సిపల్ అనుమతి లేకుండా శాశ్వత నిర్మాణం చేస్తుండగా అదే తీరున ఆ పక్కనే ఉన్న మిగతా రెండు షెట్టర్ల యజమానులు కూడా అదే విధంగా షెడ్ లు వేసి రోడ్డును అక్రమిస్తే,ప్రజలు కూరగాయల మార్కెట్ కు వెళ్ళే ప్రధాన రహదారి మూసుకొని పోయే ప్రమాద పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.ఇప్పటికైనా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంథనిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మంథని మున్సిపాలిటీ అధికారుల వ్యవహార శైలిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని,రోడ్డును ఆక్రమించి మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేసిన షెడ్ ను వెంటనే తొలగించి మున్సిపల్ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చాటాలని పలువురు పట్టణ ప్రజలు,నాయకులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 06:42PM