- రైతుల అవగాహన సదస్సులో ఏఈఓ అనిల్
నవతెలంగాణ మద్నూర్
వానాకాలం పంటసాగులో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు సదస్సులో భాగంగా మద్నూర్ మండలం లోని మొగ గ్రామంలో బుధవారం నాడు వ్యవసాయ విస్తీర్ణ అధికారి అనిల్ వానాకాలం పంటసాగుపై రైతులకు అవగాహన కల్పించారు రైతులు పంటసాగులో భాగంగా రసాయన ఎరువులు డిఏపి ఎకరాకు 50 కిలోల బస్తా వాడడం మూలంగా మొక్కలకు భాస్వరం 30 నుండి 40 శాతం మాత్రమే అందుతుందని మిగతా 60 శాతం మొక్కలకు అందడం లేదని దీనికి బదులు జీవన ఎరువులు వాడండి డిఏపి ఎరువు ను ఆదా చేసుకోండి అంటూ అవగాహన కల్పించారు ఈ అవగాహన సదస్సులు మొగ గ్రామ సర్పంచ్ సూర్య కాంత్ పటేల్ గ్రామానికి చెందిన వ్యవసాయ రైతులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm