నవతెలంగాణ - అశ్వారావుపేట:
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రైతు బంధు మండల కన్వీనర్ జూపల్లి రమేష్, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, జడ్పీటీసీ వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు అన్నారు. తెలంగాణ వ్యవసాయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. స్థానిక రైతు వేదిక భవనంలో బుధవారం వారు రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అదేవిధంగా రైతులకు తోడ్పాటునందించాలనే ఉద్దేశ్యంతో పంట పెట్టుబడి కోసం రైతుబంధు", కుటుంబాలకు ఆర్ధిక భరోసానిచ్చే విధంగా "రైతుభీమా' పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యకరమంలో సొసైటీ డైరెక్టర్లు బత్తిన పార్ధసారధి, అల్లూరి బుజ్జి, గొడవర్తి వెంకటేశ్వరరావు, కలపాల మహాలక్ష్మి, సంగా ప్రసాద్, ఏవో వై నవీన్, సీఈవో మానేపల్లి విజయ బాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 08:35PM