నవతెలంగాణ - అశ్వారావుపేట:
నకిలీ,నాసి రకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై చల్లా అరుణ హెచ్చరించారు. అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఖచ్చితంగా రసీదులు తీసుకోవాలని సూచించారు. మండలంలోని నారాయణపురం రైతు వేదిక భవనంలో విత్తనాలలో నకిలీ విత్తనాలు గుర్తించడం పై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా సకిలీ విత్తనాలు విక్రయించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీడీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, రైతు సమన్వయ సమితి గ్రామ అద్యక్షులు చిన్నంశెట్టి వెంకటనరసింహాం, నులకాని శ్రీనివాసరావు, ఏఈవో షకీరా భాను, రైతువురు రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm