- స్వేరోస్ జిల్లాద్యక్షుడు బొర్ర సురేశ్ కుమార్
- ఘనంగా స్వేరోస్ విజయ దినోత్సవ వేడుకలు
- ఉత్తమ వైద్యాధికారి,విద్యార్థినికి స్వేరోస్ ఘన సన్మానం
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రతి ఒక్కరికి అక్షరం,ఆరోగ్యం,ఆర్థికమే ప్రధాన ద్యేయంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో స్వేరోస్ పని చేస్తుందని స్వేరోస్ ఇంటర్నేషనల్ కమిటీ జిల్లాద్యక్షుడు బొర్ర సురేశ్ కుమార్ అన్నారు.బుదవారం స్వేరోస్ జిల్లా కో ఆర్డినేటర్ ఉప్పులేటి బాబు అద్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి స్వేరోస్ కమిటీ నాయకులు పూలమాలలు వేసి విజయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ వైద్యాధికార పురస్కార గ్రహీత డాక్టర్ వినోద్ బాబ్జీ, ఉత్తమ విద్యార్థిని చాల్ల పూజను స్వేరోస్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాద్యక్షుడు చిలుముల మోహన్, టీజీపీఏ కమిటీ సభ్యులు బోనగిరి ఆనంద్,భూమయ్య, స్వేరోస్ సభ్యులు తిరుపతి, శంకర్,ఆనంద్,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 08:39PM