నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ కుమారుడు ఇంద్రనీల్ వివాహం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి హుస్నాబాద్ మండల ప్రజా ప్రతినిధులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ రాయి రెడ్డి రాజా రెడ్డి, హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట జడ్పిటిసి భూక్య మంగ, ఎంపీపీ మాలోతు లక్ష్మీ బిల్లు నాయక్ , సర్పంచ్ లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm