నవతెలంగాణ-గోవిందరావుపేట.
మండల కేంద్రానికి చెందిన ఎద్దుల రాములమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అక్కినపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి. జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్ లు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి మనో ధైర్యం గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, పృథ్వీరాజ్, సూరి నేని శ్రీనివాస రావు, చింతల సత్యనారాయణ రెడ్డి, వార్డ్ మెంబర్ తుమ్మల శివ, జెట్టి రాజు,శోభన్, తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm