టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సూరపనేని సాయి కమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
పేద ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరపనేని సాయి కుమార్ అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామానికి చెందిన పగడాల సాయమ్మకు 45 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పేద ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యానికి ఏ లోటు లేకుండా ప్రభుత్వం చూస్తోందని.. ఆరోగ్య భద్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వము ఇంతగా పేద ప్రజలను ఆదుకోలేదు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్, పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీను, పిఎసిఎస్ డైరెక్టర్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వర్ధశీ చందర్ రాజు, అనిసిట్టి రామకృష్ణ,సమ్మిరెడ్డి, గజ్జి మల్లికార్జున్, పృథ్వీరాజ్, మాశీతోజు రాజేందర్, ఏనుగు సమ్మిరెడ్డి, కొండపర్తి భాస్కరాచారి,చుశీచు యాకుబ్, ఊటుకూరి వెంకటరామయ్య, పసుల సమ్మయ్య, విజయ్,ఎల్లయ్య, నాగమ్మ,గ్రామ ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 04:16PM